రామాయంపేటలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు బర్త్డే వేడుకలు.. ఘనంగా సంబరాలు!
మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు.. మెదక్ చౌరస్తాలో కేక్ కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.
Narender
ప్రచురణ: 2 నవంబర్ 2026, ఉదయం 9:38
సవరణ: 2 నవంబర్ 2026, ఉదయం 11:07
నిలుపుదల గడువు: ఇంకా 15 రోజులు

రామాయంపేట మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుకలను ఆదివారం రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బండారు మహేందర్ రెడ్డి అధ్యక్షతన ముందుగా మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం మెదక్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్ రావు మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మెదక్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ట్యాగ్లు (Tags):
